భాగవతం ప్రాముఖ్యత

వేదాంత పరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది.

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్


శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు.వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.

ఈ భాగవతం విఖ్యాతి గాంచిన అమృతగళమూర్తి, ఆకాశవాణి కళాకారుడు శ్రీ ఉషశ్రీ గారు చెపుతూ ఉంటే వినాలని ఉన్నదా.. ఐతే ఇదిగో మీ కోసం. యూనివర్సిటీ ఆఫ్ ఐయోవాలో పనిచేస్తున్న డాక్టర్ చెముటూరి నాగేంద్రగారు తనవద్దనున్న ఆడియోల భాండారం నుండి అందించిన ఆణిముత్యాలు ఒకటొకటిగా మీముందుకు ...ఈ ఆణిముత్యాలు ఇక్కడ ప్రచురించటం ఎవరికైనా అభ్యంతరకరమైతే తెలియపర్చండి..క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను...

ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి శ్రీ పురాణపండ రామ్మూర్తి . తల్లి శ్రీమతి అన్నపూర్ణ.