రాయప్రోలు వారి సీస పద్యానికి "పేరడీ".
శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారి సౌజన్యంతో.
గాయని మరియు ఇతర వివరాలు త్వరలో.
ఆలోగా ఈ ఆణిముత్యాన్ని విని ఆనందించండి.
రాయప్రోలు సుబ్బారావు గారి అసలు పద్యం

అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజవీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లిపందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు

ఆంధ్ర సంతతికే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖస్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షతలు నేడు


రాయప్రోలు వారి సీస పద్యానికి "పేరడీ".

అమలాపురీ పట్టణమున ఆంధ్రులు లేత కొబ్బరిబొండాలు కోయునాడు
ఓరుగల్లున రాజ వీరలాంఛనముగా గొడ్డుకారపు రుచి కోరునాడు
వైశాఖపురి వాడవాడల పెసరట్లు వేడివేడిగ జల్లి వేగునాడు
గుంటూరులో పుల్లగోంగూర పచ్చళ్ళు ఆంధ్రులందరి ముద్ర అయిననాడు
ఆంధ్రసంతతికే షడ్రసాభిమాన దివ్యలిప్తారస స్ఫూర్తి తీవరించె
ఆ మహావేశమదించె ఆంధ్రులార చదు చల్లుడాంధ్రకారపు ఘాటులు సకలదిశల

గోదావరీ లంకపుటాకుచుట్టలు అఖిలభారతము మావన్ననాడు
తుంగభద్రా సముత్తుంగ వనస్పతి నేయిగా జగమంత వేయునాడు
పెన్నానదీ సముత్పన్న బీడిడాక అధరాలపై నృత్యమాడునాడు
కృష్ణాతరంగ నిర్ణిద్ర కారాకిళ్ళీ తల నషాళమ్మంటి పిలుచునాడు
అక్షర జ్ఞానమెరుగని ఆంధ్రజాతి విమల కృష్ణానది సైకతములందు
కోకిలపుబాట గప్పాలు కొట్టి కొట్టి నేర్చుకున్నది రసికత నిండు ప్రజ్ఞ


rAyaprOlu subbA rAvu gAri padyam:
amaraavatee paTTaNamuna bauddhulu viSwavidyaalayamulu sthaapinchunaaDu
Orugalluna raajaveera laanChanamugaa balu SastraSaalalu nilupunaaDu
vidyaanagara raajaveedhula gavitaku penDlipandiLLu kappiMchunaaDu
poTnooriki sameepamuna naandhra saamraajya digjaya stambhamettinchunaaDu
aandhra santatikE mahitaabhimaana
divya deekshaa sukhasphoorti teevarinche
naa mahaadESa marthimchi yaandhrulaara
challuDaandhralOkamuna nakshatalu nEDu


rAyaprOlu subbA rAvu gAri pai padyAniki pAraDI (pArody):
amalaapuree paTTaNamuna aaMdhrulu laeta kobbariboMDaalu kOyunaaDu
Orugalluna raaja veeralaaMChanamugaa goDDukaarapu ruchi kOrunaaDu
vaiSaakhapuri vaaDavaaDala pesaraTlu vaeDivaeDiga jalli vaegunaaDu
guMToorulO pullagOMgoora pachchaLLu aaMdhrulaMdari mudra ayinanaaDu
aaMdhrasaMtatikae shaDrasaabhimaana divyaliptaarasa sphoorti teevariMche
aa mahaavaeSamadiMche aaMdhrulaara chadu challuDaaMdhrakaarapu ghaaTulu sakaladiSala
gOdaavaree laMkapuTaakuchuTTalu akhilabhaaratamu maavannanaaDu
tuMgabhadraa samuttuMga vanaspati naeyigaa jagamaMta vaeyunaaDu
pennaanadee samutpanna beeDiDaaka adharaalapai nRtyamaaDunaaDu
kRshNaataraMga nirNidra kaaraakiLLee tala nashaaLammaMTi piluchunaaDu
akshara j~naanamerugani aaMdhrajaati vimala kRshNaanadi saikatamulaMdu
kOkilapubaaTa gappaalu koTTi koTTi naerchukunnadi rasikata niMDu praj~nawww.maganti.org