దిబ్బరొట్టి అబ్బాయి ఒక పాత ఇంగ్లీషు కథ ఆధారంగా జేజిమావయ్య శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రూపొందించిన కథా-పదం ఇందులో కథల మావయ్య : ఎం.చిత్తరంజన్ దిబ్బరొట్టి అబ్బాయి - కె.ఎ.కల్యాణి అవ్వ - జి.అలకానంద నక్క - కె.రామాచారి ఆవు - ఎ.గిరిజ గుర్రం - ఎ.సీతామహాలక్ష్మి పొలం పనివాళ్లు - ఆర్.రాజ్యశ్రీ,ఎం.స్వరాజ్యలక్ష్మి అవ్వ తయారు చేసిన దిబ్బరొట్టిబాబు ఇంట్లోంచి పారిపోతూంటే ఆ దిబ్బరొట్టి అబ్బాయిని పట్టుకోటానికి పడే పాట్లూ, ఆ దిబ్బరొట్టిని ఆపే/తినే ఆశతో ఆవు, గుర్రం, పొలంలో పనిచేసుకునే పనివాళ్లూ - వీళ్లు తమ ప్రయత్నంలో విఫలం కాగా, సఫలం అయిన నక్కగారి తెలివి మీరు ఆడియో విని తెలుసుకోవాల్సిందే! విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైనది ఈ అరుదైన ఆడియో |