శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వీయ రచన, స్వరకల్పనలో 60వ దశకంలో రూపుదిద్దుకున్న ఎంతో అపురూపమైన జేజిమామయ్య పాటల ఆడియోలు |
చిట్టీ చిట్టీ రేగిపళ్లు చిట్టీ తలపై బోగీపళ్లు ఎంతో చక్కని బోగీపళ్లు ఎర్రా ఎర్రని రేగీపళ్లూ చిట్టీ చిట్టీ రేగిపళ్లూ చిట్టీ తలపై బోగీపళ్లు ఎంతో చక్కని బోగీపళ్లు ఎర్రా ఎర్రని రేగీపళ్లూ ఘల్లూ ఘల్లున దమ్మీడీలు జల్లుగ అల్లో నేరెడిపళ్లు తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై కలలూ ఘల్లున దమ్మీడీలు జల్లుగ అల్లో నేరెడిపళ్లు తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై పెద్దల దీవనలెన్నో పూలై ముద్దులు తీయా తీయని పళ్లై తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై పెద్దల దీవనలెన్నో పూలై ముద్దులు తీయా తీయని పళ్లై తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై పసుపూ గంధం అరటిపళ్లతో మిసమిసలాడే పట్టుచీర్లతో ముత్తైదువులా గాజులసడిలో ఎత్తున రాలే బోగీపళ్లూ పసుపూ గంధం అరటిపళ్లతో మిసమిసలాడే పట్టుచీర్లతో ముత్తైదువులా గాజులసడిలో ఎత్తున రాలే బోగీపళ్లూ చిట్టీ చిట్టీ రేగిపళ్లు చిట్టీ తలపై బోగీపళ్లు ఎంతో చక్కని బోగీపళ్లు ఎర్రా ఎర్రని రేగీపళ్లూ చిట్టీ చిట్టీ రేగిపళ్లూ చిట్టీ తలపై బోగీపళ్లు ఎంతో చక్కని బోగీపళ్లు ఎర్రా ఎర్రని రేగీపళ్లూ |