ఆకాశవాణితో పరిచయమున్న వారికి, ప్రత్యేకించి విజయవాడ, విశాఖపట్నం శ్రోతలకు శ్రీ ఎం.ఎల్.నరసింహం గారంటే చప్పున ఆయన గళంలో జాలువారిన ఎన్నో మధురమైన గీతాలు, కర్నాటక శాస్త్రీయ సంగీత గీతాలు గుర్తుకొస్తాయి. తన గళంతో శ్రోతలను కట్టిపడేసి, ముగ్ధులను చేసేసి ఈనాటికి కూడా ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప కళాకారులు శ్రీ నరసింహంగారు.

వారి అబ్బాయి - బాలగంధర్వుడిగా పేరుపొందిన శ్రీ మండా కృష్ణమోహన్ గారు సహృదయంతో తన వద్దనున్న ఆడియోల భాండారం నుంచి తన తండ్రిగారు శ్రీ నరసింహంగారి గీతాలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు, వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో.

హరిదాసులు వెడలిన ముచ్చట గని
శ్రీ ఎం.ఎల్.నరసింహం
ఆడియో సౌజన్యం: బాలగంధర్వ - శ్రీ మండా కృష్ణమోహన్