శ్రీ అయ్యగారి శ్యాం సుందర్ గారి వీణా వాద్యం కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు రాగం: తోడి తాళం: ఆది పల్లవి: కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు పెద్దల మాటాలు నే డబద్ధ మౌనో ॥క॥ అను పల్లవి: అద్దంపుఁ జెక్కిళ్లచే ముద్దుగారు మోముఁ జూడ బుద్ధి గలిగినట్టి మానద్ద రావదేమిరా ॥క॥ చరణము(లు) నిద్దుర నిరాకరించి ముద్దుగాఁ దంబురఁబట్టి శుద్ధమైన మనసుచే సుస్వరముతోఁ బద్దు తప్పక భజియించే భక్తపాలనముసేయు తద్దయశాలివి నీవే త్యాగరాజ సన్నుత ॥క॥ మృదంగ సహకారం: శ్రీ కె.వీరభద్ర రావు ఆడియో సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్ |