ఆకాశవాణి వారి "చూసిందే మళ్ళీ చూడు" సినిమా ట్రైలర్ ఇక్కడ వినవచ్చు.

ఈ ట్రైలర్ అందించిన శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారేమంటారంటే "మనకు తెలుగులో సినిమా ట్రైలర్లు తయారు చెయ్యటం వాటిని విడుదలకు ముందుగా ఇతర సినిమాలలో విశ్రాంతి సమయంలో చూపటం, తక్కువ. ఏవో అతి కొద్ది సినిమాలకు ట్రైలర్లు ఉన్నాయి. కానీ ఆంగ్ల సినిమాలకు దాదాపు ప్రతి సినిమాకు ట్రైలర్ ఉండి తీరుతుంది. అవి తయారు చెయ్యటం కూడ ఒక కళ, నైపుణ్యం ఉంటే కాని చెయ్యలేరు. కాని ఈ ట్రైలర్లు తయారు చేసేవారు చాలా భాగం అభూత కల్పనలతో డాంబికమైన మాటలతో తమ ట్రైలర్లను నింపేసి, ప్రేక్షకులను ఆ సినిమా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి డాంబికాలను , అభూత కల్పనలను ఎద్దేవా చేస్తూ ఆకాశవాణి విజయవాడ కళాకారులు మూడు దశాబ్దాల క్రితం తయారు చేసిన సినిమా ట్రైలర్ పారడీ ఇది . విని ఆనందించండి. అలనాటి ఆకాశవాణి కళాకారులకు హృదయపూర్వక అభినందనలు. ఈ ట్రైలర్ శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తిగారు(రేడియో రామం) 1980లో విజయవాడ రేడియొస్టేషన్లో అనౌన్సర్ గా పనిచేస్తున్న రోజులలో, వివిధభారతి శ్రోతల కోసం తయాయరుచేసిన "నీలినీడలు" అనే ప్రోగ్రాం కోసం చేసినది"