విజయవాడ ఆకాశవాణి - అద్భుతమైన చారిత్రక పుస్తకరాజం - ఆ చరిత్ర పుస్తకం లో ఎప్పటికీ చెరిగిపోని, చిరిగిపోని పేజి శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి (రామం) గారిది.

హైదరాబాదు ఆకాశవాణితో పరిచయమున్నవారికి సుధామ గారు చిరపరిచితులు, మహామహులు, స్వర సుధాకరులు.

ఆ ఇద్దరు మహామహులు, మేరునగరాజాలు ఒక ఇష్టాగోష్టిలో పాల్గొంటే శ్రోతలకు, ప్రేక్షకులకు విజయదశమంత పండగే. అంతటి అదృష్టం కలిగించిన డి.డి సప్తగిరి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో. రామం గారి అమ్మాయి తృష్ణ గారికి కృతజ్ఞతలతో.