1931లో జన్మించి తెలుగు సాహిత్యలోకానికి అపారమైన సేవనందించిన ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రిగారి జీవిత విశేషాల గురించి వరంగల్ ఆకాశవాణి కేంద్రం ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ వెన్నవరం ఈరారెడ్డి, మారేడుకొండ బ్రహ్మచారి గారు. కార్యక్రమాన్ని అందించిన కేశరాజు భానుకిరణ్ గారికి ధన్యవాదాలతో...

ఇక రామకోటి శాస్త్రి గారి సంక్షిప్త వివరాల్లోకి వస్తే - 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్ వరంగల్లులో ప్రారంభమైనప్పుడు తెలుగు విభాగానికి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు పునాదులు వేస్తే ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు పటిష్టపరిచారు. రామకోటి శాస్త్రిగారంటే సాహిత్య అధ్యయనం, సాహిత్య సంభాషణ. గుడివాడ కాలేజీలో అధ్యాపకుడిగా కె.జి.సత్యమూర్తి, చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైనవారికి విద్యాబోధన చేసి ఈ సాహిత్య ప్రపంచానికి ఆణిముత్యాలవంటి ఎందరో సాహితీకారులని అందించారు. ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే గారు ఆచార్యుల వారి కుమార్తె.