డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - Part 2
పరిచయ కార్యక్రమం
పరిచయకర్త: డాక్టర్ పతంజలి
ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం


"ప్రపంచ సాహిత్యంలోనే చాలా పేరు పొందిన సాహితీప్రక్రియ నవల. 11వ శతాబ్దపు ప్రారంభంలో జపాన్ దేశంలో నవలా ప్రక్రియ ఆవిర్భవించినట్లుగా కాలర్సెన్సోక్లోపీడియా 13వాల్యూంలో ఉన్నది" అంటూ డాక్టర్ పతంజలి గారు "అతడు అడవిని జయించాడు" రచనతో ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్ కేశవరెడ్డి గారితో ఆకాశవాణి పరిచయకార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత తెలుగుదేశంలో నవల జీవితానికి నూరేళ్ళు నిండాయని చెబుతూ డాక్టర్ కేశవ రెడ్డి గారు 7 నవలికలు మాత్రమే రచించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని వివరిస్తారు. ఆ తరువాత డాక్టర్ కేశవరెడ్డిగారి బాల్యం గురించీ, వారి సాహితీ ప్రస్థానాన్ని గురించి చాలా చక్కగా వివరించారు.

వృత్తి పరంగానూ, రచనా పరంగానూ చికిత్సే ప్రధాన ధ్యేయంగా కలిగినవారు అని చెబుతూ వారితో పరిచయ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన శ్రీ పతంజలి గారికీ, శ్రోతలకు ఒక మంచి కార్యక్రమం వినే అవకాశం కలిపించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి, అన్నిటికన్నా మిన్నగా ఏ భేషజం లేకుండా చక్కగా తన అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను మనతో పంచుకున్న శ్రీ కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అడగగానే ఈ మూడు గంటల ఇంటర్వ్యూను ఆరు భాగాలుగా చేసి ఎం.పి.3లుగా పంపిన శ్రీ పతంజలి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ