పండిట్ ఏల్చూరి విజయరాఘవరావు - పరిచయం 1997 లో రూపొందించబడి ప్రసారమైన ఇష్టాగోష్ఠి కార్యక్రమం పునఃప్రసారం 18 Sep 2010 ముచ్చటించినవారు : శ్రీ చిత్తరంజన్ (Rtd PEx) , శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx) ఏల్చూరి విజయరాఘవరావుగారి గురించి శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ మాటలలో : సుప్రసిద్ధ వేణువిద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావు బహుముఖప్రజ్ఞాశాలి. భరతనాట్యంతో మొదలైన ఆయన కళాజీవితం ఫిల్మ్‌స్ డివిజన్‌కూ, అనేక సినిమాలకూ సంగీత దర్శకుడుగా, సంగీతప్రయోక్తగా, కవిగా, కథకుడుగా అనేక పార్శ్వాలతో కూడుకున్నది. ఆయన అనేక రికార్డింగ్‌లలో వివిధ వాద్యాలను ఉపయోగించి అద్వితీయమైన ప్రయోగాలు చేశారు. |