ఈ అద్భుతమైన ఆడియో అందించిన శివరామ ప్రసాద్ గారు ఇలా అంటారు

బాలాంత్రపు రజనీ కాంతరావుగారు, అధికారి మరియు కళాకారుడు. సామాన్యంగా ఆ రోజుల్లో కళాకారులైనవారే స్టేషన్ డైరక్టర్లుగా ఉండేవారు. గుమాస్తాలు ప్రమోషన్లు సంపాయించి డైరక్టర్లు అయ్యేవారు కాదు. స్వతహాగా సంగీత కళాకారుడైన రజనీ కాంత రావుగారి ఆధ్వర్యంలో ఎన్నో చక్కటి భక్తిరంజని గీతాలు తయారు చెయ్యబడినాయి. వాటిల్లో బహుళ ప్రజాదరణ పొందినవి "సూర్యాష్టకం" ఈ చక్కటి అష్టకాన్ని గానం చేసినవారు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ జగన్నాధాచార్యులు శ్రీ రమణమూర్తి, శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, శ్రీమతి వింజమూరి లక్ష్మి తదితరులు. ప్రతక్ష్య దైవమైన సూర్యభగవానుడిని కీర్తిస్తూ పాడిన ఈ అష్టకంలో రజనీ కాంతరావుగారి గాన మాధుర్యం ఒక్కసారి వినండి.

గుత్తికొండ జవహర్ గారు పంచుకున్న సూర్యాష్టకం (దండకం) పూర్తి ఆడియో ఇక్కడ. వారికి ధన్యవాదాలతో

దండకం ఈ క్రింద:

శ్రీ సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైక నాధాధినాధా మహాభూత భేదంబులున్ నీవయై బ్రోవుమెల్లప్పుడున్ భాస్కరా హస్కరా

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

పద్మినీ వల్లభా వల్లకీ గానలోలా త్రిమూర్తిస్వరూపా విరూపాక్షనేత్రా మహా దివ్యగాత్రా అచింత్యావతారా నిరాకారా ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిర్ధూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాటి యేకాకినై చిక్కి యే దిక్కునున్ గానగా లేక యున్నాడ నీవాడనో తండ్రీ

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

జేగీయమానా కటాక్షంబునన్ నన్ గృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్ర మూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారథ్యమన్ గొంటి ఆకుంటి యశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి త్రోలంగ మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ కాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ ద్రుంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీ దాసులన్ గాంచి ఇష్టార్థముల్ కూర్తువో

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

దృష్టివేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంభభారంబుగానీక శూరోత్తమా ఒప్పులన్ తప్పులన్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీ కీర్తి కీర్తింప నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్త్వమున్ జూపి నా ఆత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ బ్రశంశింప నా వంతు ఆ శేషభాషాధిపుల్ కానగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు కానంగ నేనెంత ఎల్లప్పుడున్ స్వల్పజీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ చేయవే కామితార్ధప్రదా

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

శ్రీమహాదైవరాయా పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీదండకంబిమ్మహిన్ వ్రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించున్ మహాదేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమహా

________________________________________________________________________
****************************************************
________________________________________________________________________

SrI sUryanArAyaNA vEda pArAyaNA lOka rakshAmaNI daiva cUDAmaNI

sUryanArAyaNA vEda pArAyaNA lOka rakshAmaNI daiva cUDAmaNI

aatma rakshA nama@h pApaSikshA namO viSwakartA namO viSwabhartaa namO dEvatA cakravartI parabrahmamUrtI trilOkaika nAdhAdhinAdhA mahAbhUta bhEdambulun nIvayai brOvumellappuDun bhAskarA haskarA

sUryanArAyaNA vEda pArAyaNA lOka rakshAmaNI daiva cUDAmaNI

padminI vallabhA vallakI gAnalOlA trimUrtiswarUpA virUpAkshanEtrA mahA divyagAtrA acintyAvatArA nirAkArA dhIrA parAkayya Oyayya durdAnta nirdhUta tApatrayA bhIladAvAgni rudrA tanUdbhUta nissAra gambhIra sambhAvitAnEka kAmAdya nIkambulan dATi yEkAkinai cikki yE dikkunun gAnagA lEka yunnADa nIvADanO tanDrI

sUryanArAyaNA vEda pArAyaNA lOka rakshAmaNI daiva cUDAmaNI

jEgIyamAnA kaTAkshambunan nan gRpAdRshTi vIkshinci rakshimcu vEgan munIndrAdi vandyA jagannEtra mUrtii pracamDaswarUpunDavai yunDi canDAmSu sArathyaman gonTi aakunTi yaSwambulEDinTi cakrambulun dAlci trOlanga mArtAnDa rUpunDavai cenDavA rAkshasAdhISulan kAnci karmAnusArAgra dOshambulan drunci kIrti pratApambulan minci nI dAsulan gAnci ishTArthamul kUrtuvO

sUryanArAyaNA vEda pArAyaNA lOka rakshAmaNI daiva cUDAmaNI

dRshTivElpA mahA pApa karmAlakunnAlayambaina yI dEhabhArambhabhArambugAnIka SUrOttamA oppulan tappulan nEramul mAni pAlimpavE paTTi nI kIrti kIrtimpa nEnErtunA dwAdaSAtmA dayALutvamun tattvamun jUpi nA aatma bhEdambulan bApi pOshimpa nIvantu ninnun braSamSimpa nA vantu aa SEshabhAshAdhipul kAnagAlEru nI divyarUpa prabhAvambu kAnanga nEnenta ellappuDun swalpajeevunDanaudun mahAkashTuDan nishTayun lEdu nI pAdapadmambulE sAkshi duScintalan bApi niScintugan cEyavE kAmitArdhapradA

sUryanArAyaNA vEda pArAyaNA lOka rakshAmaNI daiva cUDAmaNI

SrImahAdaivarAyA parAvastulainaTTi mUDaksharAlan swarUpambu nIdanDakambimmahin vrAya kIrtinci vinnan mahAjanma janmAntaravyAdhi dAridryamul pOyi kAmyArdhamul kongu bangAru tangEDu junnai phalincun mahaadEva dEvA namastE namastE namastE namahA