ఈ అద్భుతమైన ఆడియో అందించిన శివరామ ప్రసాద్ గారు ఇలా అంటారు

"శ్రీ సూర్యనారాయణా" అన్న ఒక రమణీయమైన బృందగీతం - ఈ పాట సామాన్యంగా ఆదివారాల్లో మాత్రమే వేసెవారు (ఆదివారం సూర్యుని రోజు కావటం వల్ల కాబోలు). ఈ పాటకోసం వారమంతా వేచి ఉండి. ఆదివారమైనా సరే పొద్దున్నే లేచి వినటంలో ఉన్న ఆనందం, ఇప్పుడు పొద్దున్నే వచ్చే చద్ది వార్తలు వింటూ లేవటంలో లేదు. ఒక్కసారి ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవటానికి "శ్రీ సూర్యనారాయణా" అంటూ మనం కూడ గళం కలిపి ఆనందిద్దాం!