కథా రచయిత శ్రీపతి గారి పరిచయం

పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (AIR PEx)
ప్రసారం తేదీ : 16 అక్టోబరు 2010
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం.
ఆడియో అందించిన రంజని గారికి ప్రత్యేక ధన్యవాదాలతో

ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.నవ్వుల్లో ప్రాచీనుడు శ్రీపతి. గిరిజన ప్రాంతాలు, నదీతీరాలు, పల్లెసీమల నిసర్గ సౌందర్యాన్ని ఆవిష్కరించిన శ్రీపతి చాలా ఎక్కువగా రాయకపోయినా నిలిచిపోయేవే రాశారు. పల్లెలెట్లా మారుతున్నాయో శ్రీపతి గారి కథల్లోనే చూడాలి.