శివతాండవం సంగీత రూపకం (1993) - Part 1
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం గేయకావ్యానికి
రేడియో అనుసరణని వారి కుమార్తె శ్రీమతి నాగపద్మిని చేసారు.
సంగీతం: శ్రీ యెల్లా వేంకటేశ్వరరావు
పునఃప్రసారం : 12 Dec 2010


మొలక మీసపు గట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతి జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనల దగులు భృంగ గణంబు
గనుల పండువుసేయ, మనసునిండుగ బూయ
ధణధణధ్వని దిశతతి బిచ్చలింపగా

ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు

పుట్టపర్తి వారి శివతాండవ కావ్యం ఇక్కడ చూడవచ్చు