లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి

లిటరరీ భోజన హోటల్
ప్రతి మంగళవారం ఉదయతరంగిణి కార్యక్రమంలో
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 19, 2011
సౌజన్యం - మాగంటి వంశీ

వ్యాఖ్యాత: పైడి తరేష్ బాబు
వంటకం: పిల్లలకే నా హృదయం అంకితం
వంటవాడు: సుహోం లిన్ స్కీ
ప్రచురించిన సంవత్సరం: 1974
తెలుగు అనువాదం: ఆర్.వి.ఆర్ (1983)
పబ్లిషర్స్: ప్రగతి ప్రచురణాలయం

బాలల సాహిత్యం అంటే అందరికీ ఇష్టమే, అయితే ఆ బాలలు తమ బాల్యాన్ని నిజంగా అనుభవిస్తున్నారా అన్న ప్రశ్నకు వస్తే - ఆ అద్భుతమైన బాల్యాన్ని రష్యన్ బాలలు నిజంగానే అనుభవించే విధానాన్నీ, ఒక రష్యన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన సుహోం లిన్ స్కీ మూడు అంశాలతో నిర్మించిన బోధనా పద్ధతినీ వివరించే పుస్తకం ఇది. యూరప్ ఖండం అంతా ఆశ్చర్యపోయిందిట ఈ బోధనా పద్ధతిని చూసి. ఆశ్చర్యపోయాకా, ఆ పద్ధతుల వల్ల పిల్లలు పొందిన లాభాలు చూసిన తరువాత మెల్ల మెల్లగా తమ తమ స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టారట, ఆ అంశాలను, పద్ధతులను......ఆ పుస్తకం గురించి వివరించినవారు పైడి తరేష్ బాబు...ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం