ప్రజాకవి కీ.శే. కాళోజీ నారాయణరావు తెలుగు రుచిని, వాడినీ, వేడినీ పుణికి పుచ్చుకున్న కవి. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికై అంకితమైన కాళోజీ, మరాఠీ మాతృభాషకు చెందిన వంశీకుడు. అయినా, తెలుగన్నా, తెలుగువారన్నా ఎంతో అభిమానం. తెలుగు జనజీవనంతో మమేకమైపోయిన కాళోజీ నారాయణరావు గారితో పొట్లపల్లి శ్రీనివాస రావు గారు మరియు అనిశెట్టి రజిత గార్లు పాల్గొన్న చర్చా కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం. ఆడియో అందించిన భాను కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో