రేడియో కళాకారిణి శ్రీమతి టి బాలాత్రిపురసుందరి పరిచయం
పరిచయకర్త శ్రీమతి ఏ. ఉషా రాణి (AIR PEx)
ప్రసారం : 26 September 2010

ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటారు - బాలాత్రిపురసుందరి గారు మొదట విజయవాడ రేడియో కేంద్రంలో మహిళా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కొన్ని సంస్కృత నాటకాల్లో కూడా గాత్రధారణ చేసారు. తర్వాత హైదరాబాదు కేంద్రంలో డ్రామా ఆర్టిస్టుగా ఎన్నిక అయ్యారు. మహిళా కార్యక్రమాలతో పాటుగా అనేక రేడియో నాటకాల్లో పాల్గొన్నారు. సుమారు 15 లఘు నాటికలు , రెండు గంట నాటకాలు రచించారు. "తాతయ్య పెళ్లి" అనే నాటక రచన మంచి పేరు పొందింది. కొన్ని సినిమాలలో డబ్బింగు కూడా చెప్పారు. ఇప్పుడు వయసు 81 సంవత్సరాలు