వంశాంకురం నాటకం (1975) రచన & నిర్వహణ : శ్రీ కె చిరంజీవి పునఃప్రసారం : 10 october 2010 ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అన్న అంశం ప్రధానంగా సాగి, ప్రేమను సఫలం చేసుకోడానికి ధైర్యం ఎంత అవసరమో చక్కగా వివరించిన సాంఘిక నాటకం - వంశాంకురం...ఈ ఇతివృత్తంతో 1975లో వ్రాయడం మరింత అబ్బురం.. (1961 - 1993) కాలంలో ఆకాశవాణి హైదరాబాదు నాటక విభాగ కళాకారుడిగా పనిచేసిన శ్రీ కె చిరంజీవి గారు రాసిన ఆ నాటకం ఇదిగో మీ కోసం.దాదాపు గంట నిడివి కల ఈ నాటకం కోసం మీ సమయం వెచ్చించడానికి సిద్ధమైపోండి మరి.. ఘనపురం దేవేందర్ గారు తన ఎం.ఫిల్ పట్టా కోసం తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించిన "శ్రీ కె.చిరంజీవి గారి రేడియో నాటికలు - పరిశీలన" అనే లఘు సిద్ధాంత వ్యాసంలో - "వంశాంకురం" నాటకం గురించి ఇలా స్పృశిస్తారు. పూర్తి సిద్ధాంత వ్యాసం ఇక్కడ చూడవచ్చు. ఈ పూర్తి సిద్ధాంత వ్యాసం ఇలా ఇక్కడ ప్రచురించడమెవరికైనా అభ్యంతరకరమైతే తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను శ్రీ రంజని గారి సౌజన్యంతో (తెలుగుథీసిస్.కాం). ఈ ఆడియోను అందించిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు |