"రాంబాబు కాపరం " (నాటిక)
తాతా రమేశ్ బాబు గారి సౌజన్యంతో

ప్రియ మిత్రులు శ్రీ తాతా రమేశ్ బాబు గారిని సంప్రదించగానే, ఎంతో సంతోషంగా వారి వద్ద ఉన్న ఆకాశవాణి రికార్డింగులు, ఆడియోలు ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.వీరు ప్రముఖంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి అనుబంధంగా పనిచేసారు. ముఖ్యంగా "పగటి వేషాలు-సామాజిక అంశాలు ",'గుడివాడ నాటక రంగం " ప్రముఖ రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ తో ముఖాముఖీ రెండు సార్లు. మొదలైనవి. ఆకాశవాణి నాటక కళాకారుడుగా,"రాంబాబు కాపరం "లో రాంబాబు గా," నాదయోగి " జాతీయ నాటకం లో రామరాయుడు,భటుడు గా,"అపూర్వ నరకం " లో తమిళ హోటల్ అయ్యారు గా,"కూటి విద్య " లో విలేఖరి గా,నటించి ఎందరి అభిమానానికి పాత్రుడు కాగలిగారు.

"రాంబాబు కాపరం "నాటిక వివరాలు ఇవిగో:

రచన : అద్దేపల్లి భరత్ కుమార్
నిర్వహణ : ఎలిసెల నాగేశ్వర రావు
పాత్రలు :
రాంబాబు : తాతా రమేశ్ బాబు
సీత : వి.ఎస్.రత్నమాల
వానర మూర్తి : డి. నాగేశ్వర రావు
సింగినాథం ; పఠాన్ చందు ఖాన్
ఈ నాటిక ఫిబ్రవరి 2 ,2008 రాత్రి 9 .30 నుండి 10 వరకు -ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్మించి ప్రసారం చేసింది.
రాంబాబు కాపురం