"ప్రతాపరుద్రీయం" - 1897 లో మహామహోపాధ్యాయ శ్రీ వేదం వేంకటరాయ శాస్త్రి గారిచే రచింపబడిన చారిత్రక రచన. ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రుణ్ణి మొఘలుల చెర నుండి , ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు ఎలా రక్షించాడన్నది చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు వేదం వారు. తెలుగు నాటక రంగంలో మొట్టమొదటి చారిత్రక నాటకంగా ఈ "ప్రతాపరుద్రీయాన్ని" పేర్కొంటారు. ఈ రచనను రేడియో నాటకంగా మలిచి ప్రసారం చేసిన ఆకాశవాణి వారు అభినందనీయులు. ఆకాశవాణిలో ఎన్నోసార్లు పునఃప్రసారం కాబడిన ఆ నాటకం ఇదిగో మీకోసం - శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారి సౌజన్యంతో

ఈ ఆడియోను అందించిన ఆయనకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ