నాటికి నేడు - నాటిక (శ్రీ విశ్వనాథ కవిరాజు)
డాక్టర్ కారంచేడు గోపాలంగారి సౌజన్యంతో

మల్లాది విశ్వనాథ కవిరాజు - వీరి గురించి తన రచన "ఆంధ్ర నాటకరంగ చరిత్రలో" శ్రీ మిక్కిలినేనిగారు ఇలా వివరిస్తారు.

1894లో శ్రీకాకుళంలో కవిరాజుగారు జన్మించారు. మెట్రిక్యులేషన్ ప్యాసైనారు. భళ్ళమూడి దక్షిణామూర్తిశాస్త్రుల వారివద్ద సంస్కృత కావ్య నాటకాలను అభ్యసించారు. ఆనాడు శ్రీకాకుళంలో సురభి రామయ్య ప్రదర్శించిన నాటకాలను చూశారు. నాటక కళ మీద అభిరుచి ఏర్పడి, 15వ ఏట 'లాక్షాగృహం" అనే ఏకాంకికను రచియించారు. 23వ ఏట తెలుగు పండితుడుగా పనిచేశారు. సురభి పాపాబాయి నాటక కంపనీకి కొన్ని పౌరాణిక నాటకాలను వ్రాసి యిచ్చారు. చట్టి పూర్ణయ్య పంతులుగారితో కలిసి "పోలాకి" అనే గ్రామంలో నాటక కళా పరిషత్తును చిన్న స్థాయిలో స్థాపించారు. విజయనగరంలో బుర్రా శేషగిరిరావు, అడిదం నారాయణమూర్తిగార్లతో కలిసి "నాటక కళ" పత్రికను స్థాపించారు. ఆంధ్ర నాటక కళ పరిషత్ స్థాపకుల్లో ఒకరు. వ్యవహారిక భాషలో 50 వరకూ వినోద నాటికలను రచించారు. వాటిలో దొంగాటకం, నేపథ్యం, పిల్ల జమిందారు, నాటికి నేడు, కిర్రుగానుగ మొదలైనవి పుస్తకాలుగా వెలువడ్డాయి. 1936లో సినిమా రంగంలో ప్రవేశించారు. భక్త మార్కండేయకు సంభాషణలు, పంతులమ్మ, సౌదామిని చిత్రాలకు కథలూ వ్రాశారు. వీరి అముద్రిత గ్రంథాలు, శివమహాపురాణం, వివిధ వ్యాసాలు 100, నాటికలు 50, వసంతసేన, హంస, మహాత్మా కబీరు, జమీందారు, పాలఘాటు పెళ్ళి, మహానంద, కృష్ణ మాయ, నూర్జహాన్ మొదలైనవి. 1946లో మద్రాసులో మరణించారు.

మల్లాది విశ్వనాథ కవిరాజు గారి చిత్రం ఇదిగో



This is a classic play of 30 minutes written by Shri Viswanatha Kaviraju with only two Characters enacted by Shri Kuchimanchi Kutumba Rao and Smt. P.Sitaratnamma. Lovers some 40 years back who could not marry for fear of elders and meet in a train journey from Vijayawada to Rajahmundry. It's a great play