నాటకం - ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం

"నాటకం" - Part 2
రచన: శ్రీ డి.వి.నరసరాజు
నిర్వహణ: శ్రీ పాండురంగం, శ్రీ సుబ్బారావు
సాంకేతిక సహాయం: శ్రీ బి.ప్రకాశరావు

ఊర్వశి: శ్రీమతి జి.నిర్మల (సినిమా నటి నిర్మలమ్మ)
రఘుపతి: శ్రీ రామచంద్ర కాశ్యప్
రామానుజం : శ్రీ నండూరి సుబ్బారావు
మధు: శ్రీ ఎల్.నరసింగరావు
బట్లర్ : శ్రీ విన్నకోట రామన్న పంతులు
శివశంకరం: శ్రీ మాచినేని వేంకటేశ్వరరావు
కామరాజు: శ్రీ కోకా సంజీవరావు

ఒక నాటకాన్ని ప్రారంభించటం, ప్రధాన పాత్రలని పరిచయం చెయ్యటం, అసలు పాత్రలెందుకు వచ్చాయో ప్రేక్షకులకు అర్థం కావటానికి అరగంట పట్టటం, ఈ గొడవంతా ఎందుకు పాత్రలని ప్రవేశపెట్టగానే స్టేజీ మీదే పరిచయం చేసేసి ఆ తర్వాత అసలు నాటకం మొదలుపెట్టటం - ఇలా కొత్త విధానం మనమే మొదలుపెడదామంటూ - ఊర్వశి రూము పక్కనే హోటల్లో రూము బుక్ చేసిన రఘుపతి సంగతులతో సాగుతూ బోల్డంత హాస్యాన్ని కురిపిస్తూ నడిచిన ఈ "నాటకం" అపురూపమైన నాటకాన్ని ఆడియో రూపంలో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో