"న" కు దీర్ఘమిస్తే - నాటిక

2005 నంది నాటకోత్సవాలలో , సాంఘిక నాటికల విభాగంలో ఉత్తమ నాటికగా బంగారు నంది బహుమతి గెలుచుకున్న నాటిక - "న" కు దీర్ఘమిస్తే ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం చేసింది.

రచన, దర్శకత్వం: శ్రీ.బి.పి.ప్రసాదరావు

పాత్రలు / పాత్రధారులు:-

* వృద్ధుడు:శ్రీ బి.పి.ప్రసాద రావు
* రంగడు: భవానీ ప్రసాద్
* పాండు: శ్రీ.సి.వి.ఎస్.శాస్త్రి
* కార్తీక్: శ్రీ నాగసాయినాథ్
* జోగినాథం: శ్రీ సి.నారాయణస్వామి
* కాంతం: శ్రీమతి శ్రీలక్ష్మి
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

హైదరాబాదు వంశీ - నిరంజన్ కళాకేంద్రమ్ సభ్యులు సమర్పించిన కార్యక్రమం ఇది.

బి.పి.ప్రసాదరావు గారు, భవానీ ప్రసాద్ గారు - ఆయా పాత్రల్లో జీవించేసారు అంటే అతిశయోక్తి కాదు. వారిద్దరికీ, వారిలోని కళాకారుడికీ హృదయపూర్వక నమస్సులతో....

సుమారు 50 నిముషాల నిడివి కల ఈ నాటికను విని ఆనందించండి