ధృవాదేవి చంద్రగుప్తుడు - అఖిల భారత నాటకం

ధృవాదేవి - గుప్త సామ్రాజ్యానికి మహారాణి. జగజ్జేత సముద్ర గుప్తుని కుమారులు రెండవ చంద్రగుప్తుడు, రామగుప్తుడు.మొదట రామగుప్తుని భార్యగా గుప్త సామ్రాజ్యంలోకి ప్రవేశించిన ఈ రాణి, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల చంద్ర గుప్తుని భార్యగా మారి మహారాణి పగ్గాలు స్వీకరించింది. అతిపరాక్రమవంతుడు కుమార గుప్తుడి తల్లి.

విశాఖదత్తుడు తన రచనలు దేవీచంద్రగుప్తం, నాట్యదర్పణం మొదలైన వాటిలో ధృవాదేవి గురించి విస్తృతంగా రాసాడు.అత్యంత సౌందర్యవతి, చాలా తెలివిడి కల మనిషి అనీ, గుప్తుల కొలువులో కవులను పోషించిన ఘనత ఈమెకే చెందుతుందనీ విశాఖదత్తుని వర్ణన.

ఇహ కథలోకి వస్తే, క్లుప్తంగా - శకరాజు గుప్తులమీదకు దండెత్తతానికి సమాయత్తమవుతూ ధృవాదేవిని తన పరం చేస్తే యుద్ధం మానేస్తానని వర్తమానం పంపుతాడు. రామగుప్తుడు భయపడిపోయి, ధృవాదేవిని శకరాజు వద్దకు పంపించటానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రగుప్తుడు ఓ ఉపాయం ఆలోచించి, ధృవాదేవితో కలిసి మారువెషం వెసుకుని శకరాజు వద్దకు వెళ్ళి శకరాజుని అంతం చేస్తాడు. ఆ తర్వాత తనను తాకట్టు పెట్టినందుకు ధృవాదేవి చేవలేని రామగుప్తుణ్ణి ప్రజల సమక్షంలో భర్తగా వదిలేసి చంద్రగుప్తుని వరిస్తుంది. ఆ తరువాత మనకు తెలిసిన కథే - చంద్రగుప్తుడు - విక్రమాదిత్యుడిగా వెలుగొందటం, విశాల సామ్రాజ్యం స్థాపించడం, చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజ్యపాలన చేసి గుప్త వంశానికే మకుటాయమానంగా నిలచిపోవటం...

ఈ కథకు నాటిక రూపం కల్పించి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రసారం చేసింది.

ఆడియో రికార్డింగు సౌజన్యం: మాగంటి వంశీ

నిర్వహణ: శ్రీమతి రతన్ ప్రసాద్ (చిన్నక్క)
మూలం: హిందీ రంగస్థల రచన - శ్రీ జయశంకర్ ప్రసాద్
తెలుగుసేత: డాక్టర్ సరోజా నిర్మల
రేడియో అనుసరణ: శ్రీ సుదర్శన్ కుమార్
పర్యవేక్షణ - శ్రీ చావలి దేవదాస్
సహకారం: శ్రీ ప్రభాకర్ జాజుల

ఇందులో పాల్గొన్నవారు:
ధృవస్వామిణి: శ్రీమతి శిల్ప
మందాకిని: శ్రీమతి ఏ.పి.మైథిలి
రామగుప్తుడు: శ్రీ సుబ్బరాయ శర్మ ఉప్పులూరి
చంద్రగుప్తుడు:శ్రీ ఎస్.మనోహర్
శిఖరస్వామి: శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి
శకరాజు: శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్
కోమ: శ్రీమతి ఏ.కె.శ్రీదేవి
మిహిరకులుడు: శ్రీ బొర్రా నిరంజన రావు
పురోహితుడు: శ్రీ గణాశంకర్ పూజారి

నాటిక మొదటి 10 నిముషాలు రికార్డు చెయ్యలేకపోయినందుకు చింతిస్తూ...

సుమారు నలభై నిముషాల నిడివి కల ఈ నాటికను విని ఆనందించండి