విదులను తలచెద నెదలో ఈ పాట గురించి రచయిత శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారి మాటల్లోనే 1979లో వ్రాసి అదే ఏడాది రేడియోలో ప్రసారమైన పాట ఇది. హైదరాబాదు నుంచి శ్రీరంగం గోపాలరత్నం గారు విజయవాడకు వచ్చి శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి సంగీత దర్శకత్వంలో గానం చేశారు. ముప్ఫైనాలుగేళ్ళ తర్వాత మళ్ళీ వినే సదవకాశం కలిగింది. విజయవాడ స్టేషన్ డైరెక్టరు గారు దయతో నాకు పంపించారు. ఒకనాటి మధురస్మృతిని మీతో పంచుకోవాలనిపించి, పంపుతున్నాను. |
పూర్తి పాఠం ఈ క్రింద.... శ్రీ మురళీధరరావు గారికి సహస్ర కృతజ్ఞతలతో విదులను తలచెద నెదలో మధుసూదన వర పరిపూర్ణ మనో విదులను తలచెద నెదలో మధుసూదన వర పరిపూర్ణ మనో విదులను తలచెద నెదలో ... కందువ తెలియని పరమానందము చందమ్ము చిందు డెందమ్ములందు సుందరతర గోవిందపాదారవింద మధుర మకరంద బిందు కో విదులను తలచెద నెదలో మధుసూదన వర పరిపూర్ణమనో విదులను తలచెద నెదలో ... భాసురముగ శ్రీ వాసుదేవ పద వాసిత నిరతోపాసన చేసిన దాసదాసులను దోసములెంచక బాసట నెలకొను వాసవమతి సం విదులను తలచెద నెదలో మధుసూదన వర పరిపూర్ణమనో విదులను తలచెద నెదలో ... నేరక భువి సంసారకర్మముల జార కలుషముల జారక నిలిచిన ఆరక వెలిగెడి తారకదీపము తారకగుణ విస్తారకమను శ్రీ విదులను తలచెద నెదలో మధుసూదన వర పరిపూర్ణ మనో విదులను తలచెద నెదలో మధుసూదన వర పరిపూర్ణ మనో విదులను తలచెద నెదలో ... |