శ్రీ మహేంద్రవాడ బాపన్నశాస్త్రి గారి స్వరంలో 78 RPM గ్రామోఫోన్ రికార్డు మీద ఉన్న అపురూపమైన ఈ ఆడియోను డిజిటైజు చేసి అందించిన శ్రీ డాక్టర్ కె.బి.గోపాలం (విజయగోపాల్) గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో

శ్రీ మహేంద్రవాడ బాపన్నశాస్త్రి గారిది తూర్పు గోదావరి జిల్లాలోని యింజరం గ్రామం. తల్లి సూర్యాంబ. తండ్రి కామయార్యులు. ఏ సంగీత సభకెళ్ళినా బాపన్నశాస్త్రి గారు, బహుమతి తీసుకోకుండా వేదిక దిగలేదని వినికిడి. 1934 లో కొలంబియా రికార్డింగ్ కంపెనీ బాపన్న గారి పాటలు రికార్డులుగా విడుదల చేశింది.