కవిసమ్రాట్ శ్రీ నోరి నరసింహశాస్త్రి

కవిసమ్రాట్ శ్రీ నోరి నరసింహశాస్త్రి గారి గురించి శ్రీ దేవులపల్లి రామానుజ రావుగారు ఏం అంటారంటే - "బహుముఖ ప్రతిభామూర్తులు శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. ప్రసిద్ధ కవులు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు."

కవిసమ్రాట్ శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు 1944 మే నెల ' భారతి ' పత్రికలో వ్రాసిన వ్యాసం ' కవితా లక్ష్యము ' ఆడియో రూపంలో ఇక్కడ.... ఇదే వ్యాసం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు ప్రచురించిన ' సారస్వత వ్యాసములు - ఐదవ సంకలనం ' లో ప్రచురించబడింది.
www.maganti.org