శ్రీ గిడుగు రామమూర్తి పంతులు

గిడుగు రామమూర్తి పంతులుగారు ఆంధ్ర దేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహు భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు, వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, పామరులకీ, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చి మహాసాహితీ సృష్టి జరిగింది. ఆయన 1913 సంవత్సరం ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో రాసిన " నేటి తేట తెలుగు " అనే వ్యాసం ఆడియో రూపంలో ఇక్కడ.

ఈ వ్యాసం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి వారి ప్రచురించిన సారస్వత వ్యాసములు - తృతీయ సంపుటములో చూడవచ్చు
www.maganti.org