డా.బెజవాడ గోపాలరెడ్డి.

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసారు. ఆయన భారతి పత్రిక అక్టోబరు 1928 సంచికలో రాసిన " రామాయణము * " ( రవీంద్రుని మాతృక నుండి) అనే వ్యాసం ఈ ఆడియో భాగంలో

* శ్రీయుత దినేశ చంద్రసేన్ గారి " రామాయణీకథా " అను గ్రంథమునకు భూమికా స్వరూపమున రవీంద్రులచే 1923 సం. డిసెంబరులో రచింపబడింది

ఈ వ్యాసం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి వారి ప్రచురించిన సారస్వత వ్యాసములు - తృతీయ సంపుటములో చూడవచ్చు
www.maganti.org