శ్రీ అక్కిరాజు రమాపతి రావు

"తెలుగు నవల" - మూడవ భాగానికి సాదర ఆహ్వానం

అక్కిరాజు రమాపతిరావు గారు తన "తెలుగు నవల" అనే రచనలో నవల అనే సాహితీ ప్రక్రియ ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు. ఈ మూడవ, చివరి భాగంలో , నవల తన ప్రౌఢ వయసులో ఎలా సంచరించిందో, ఏ ఏ మహారచయితలు ఆ నవలాసుందరిని ఎన్నో దారులలో తిప్పి సాహిత్యశిఖరాగ్రాన ఎలా ప్రతిష్ఠించారో చూద్దాం...

మొదటి , రెండు భాగాలు విన్నాక, ఈ మూడవ భాగం వినమని ప్రార్థన.

ఈ రికార్డింగులో నా అభిమాన రచయిత, నేను ప్రాణమిచ్చేసే మహారచయిత "శ్రీ తెన్నేటి సూరి" గారి గురించి రమాపతిరావు గారు రాసిన ప్రతి పంక్తి నాలో ఏదో తెలియని ఉద్విగ్నతను కలిగించింది. ఇదీ అని చెప్పలేని ఒక అద్భుతానంద రససమ్మిళితమయిన భావం మనసులో పరుచుకుంది..ఆ పంక్తులు చదువుతున్నప్పుడు నా గొంతు ఎలా వినపడినా, శ్రోతలు పెద్దమనసుతో సర్దుకుపోతారని ఆశిస్తూ...
www.maganti.org