శ్రీ అక్కిరాజు రమాపతి రావు

శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు మంజుశ్రీగా తెలుగు ప్రజలకు, సాహిత్యాభిమానులకు చిరపరిచితులు. మంజుశ్రీ గారి గురించి శ్రీ చీకోలు సుందరయ్య గారు ఇలా అంటారు - "మంజుశ్రీ కథలు రాశారు, నవలలు రాశారు, సాహిత్య చరిత్రలు, జీవిత చరిత్రలు రాశారు. అనువాద సాహిత్యం అందించారు. భాషాచరిత్రలో నిరుపమాన సేవ చేశారు. సంపాదకులుగా ఎన్నో గ్రంథాలు వెలయించారు. సంకలనాలు, కూర్పులు, సాంఘిక చరిత్రలు, ఆధ్యాత్మిక రచనలు..లెక్కలేనన్ని. ఇక వక్తగా, ఉపన్యాసకుడిగా, పరిశోధకుడిగా, వివిధ సాహితీ ప్రక్రియల్లో న్యాయనిర్ణేతగా ఎంతో చైతన్యం అందించారు. పందొమ్మిదో శతాబ్దం కందుకూరిదైతే ఇరవయ్యో శతాబ్దంలో అంతటి ప్రతిభ చూపినవారిలో అక్కిరాజు రమాపతిరావు గారు ప్రముఖులు" అని అంటారు.

అక్కిరాజు రమాపతిరావు గారు సుమారు 1975 ప్రాంతంలో రాసిన "తెలుగు నవల" రచనలో తెలుగు నవల గురించి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి, 1975 దాకా నవలా ప్రస్థానాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు. దాదాపు 47 పేజీలు కల ఆ పుస్తకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు 1975లో ప్రచురించారు. ఆ "తెలుగు నవల"ను ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేసాను. ఆ రచనలోని మొదటి 15 పేజీలు, 40 నిముషాల నిడివి కల భాగం ఆడియోగా ఇక్కడ వినవచ్చు.

రెండు, మూడు భాగాలు త్వరలో మీ ముందుకు...
ఈ రికార్డింగులో జరిగిన రెండు తప్పులకు పెద్దలు పెద్దమనసుతో క్షమించాలి

1. ఉపోద్ఘాతంలో రమాపతిరావుగారి రచన "తెలుగు నవల" బదులు "తెలుగు రచన" అని చెప్పడం జరిగింది
2. చీకోలు సుందరయ్యగారు అక్కిరాజు గారి గురించి చెబుతూ ఉన్న భాగంలో "వీరేశలింగం పంతులు గారు" బదులు "వీరేశలింగం గారి పంతులు" అని వ్యాఖ్యానించడం జరిగింది.
www.maganti.org